Header Banner

మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! అర్హతలు, ఎంపిక వివరాలు ఇదే!

  Thu Feb 27, 2025 11:25        Others

మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయ నున్నారు. విద్యా అర్హతల పరిశీలనతో పాటు కేవలం ఇంటర్వ్యూలతోనే రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు వివరాలను మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు మార్చి 4న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 2 లోగా సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ మెంటర్ హెల్త్ సర్వే ప్రాజెక్టు స్టాప్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు ఎంపికైన వారు ఆరు నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉంటారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక అయిన వారు 11 నెలల పాటు ఒప్పందం ప్రాతిపదికన ఉంటారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా పని చేసే కాలాన్ని పొడిగిస్తారు. సీవీలు మెయిల్ చేసిన అభ్యర్థులు మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు...? మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులు ఐదు, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టు ఒకటి భర్తీ చేస్తున్నారు. ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు విద్యా అర్హత సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డవలప్మెంట్ తదితర సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ చేసి ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టులు, ప్రొగ్రామ్స్ పని చేసే అనుభవం ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి.
• రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు మైక్రోబయోలజీ, వైరాలజీ, మెడికల్ జెనిటిక్స్, మలిక్యూలర్ బయోలజీ, బయో టెక్నాలజీలో ఎంఎస్సీ చేయాలి.
• ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు- రూ.45,000 తోపాటు ట్రావెల్ అలివెన్స్ తదితర సదుపాయాలు కల్పిస్తారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


• రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు- రూ.35,000 జీతం చెల్లిస్తారు. ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు వయో పరిమితి 40 నుంచి 45 ఏళ్లుగా ఉంది.
• రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు వయో పరిమితి 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సు నిబంధనల్లో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం....
1. ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు సంబంధించి మార్చి 2 తేదీ సాయంత్రం 5 గంటల లోపు అధికారిక మెయిల్ ఐడీ ap.nmhs2cen@nimhans.net కి సీవీవీ ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. మార్చి 4న ఉదయం 8.30 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
2. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి మార్చి 4 తేదీ సాయంత్రం 5 గంటల లోపు అధికారిక మెయిల్ ఐడీ vrdlicmr.aiims@gmail.com కి సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ త్వరలో వెల్లడిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #aiims #recruitment #notification #todaynews #flashnews #latestupdate